పిచాయ్‌కు రూ.1291 కోట్లు

30 Apr, 2017 01:52 IST|Sakshi
పిచాయ్‌కు రూ.1291 కోట్లు

హూస్టన్‌: గూగుల్‌ సీఈవో, భారత్‌కు చెందిన సుందర్‌ పిచాయ్‌ గతేడాది ప్రతిఫలంగా (స్టాక్‌ అవార్డు) కంపెనీ నుంచి భారీ మొత్తం అందుకున్నారు. 2016 సంవత్సరానికి దాదాపు 198.7 మిలియన్‌ డాలర్లను(దాదాపు రూ. 1291 కోట్లు) పిచాయ్‌కు గూగుల్‌ అందజేసింది. 2015తో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం.

2015లో పిచాయ్‌కు దక్కిన స్టాక్‌ అవార్డు మొత్తం 99.8 మిలియన్‌ డాలర్లు (రూ. 648 కోట్లు). స్టాక్‌ అవార్డుతో పాటు 2016లో వేతనంగా 6.5 లక్షల డాలర్లు(4.22 కోట్లు)అందుకున్నారు. అయితే 2015లో పిచాయ్‌ వేతనం 6.52 లక్షల డాలర్లు. ఆగస్టు 2015లో సీఈవోగా సుందర్‌ పిచాయ్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం గూగుల్‌ భారీ లాభాలను ఆర్జించింది. ప్రకటనల విభాగం, యూట్యూబ్‌ బిజినెస్‌లు బాగా పెరిగాయి. అలాగే మెషీన్‌ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2016లో గూగుల్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదలైంది.

మరిన్ని వార్తలు