ఈ కప్ప పొడవు గోరంతేనట !

6 Jun, 2015 09:00 IST|Sakshi
ఈ కప్ప పొడవు గోరంతేనట !

బ్రెజిల్: దక్షిణ బ్రెజిల్‌లోని అట్లాంటిక్ వర్షారణ్యంలో శాస్త్రవేత్తలు ఏడు కొత్త జాతుల కప్పల్ని కనుగొన్నారు. అన్ని కప్పలూ బొటనవేలి గోరు (ఒక సెంటీ మీటర్ ) కంటే చిన్నగా ఉండడం విశేషం. ఈ కప్ప కాంతిమంతమైన చర్మం కలిగి ఉంది. సహజంగా ఇలాంటి కప్పలు శత్రువుల నుంచి రక్షణ పొంచి ఉన్నప్పుడు చర్మంపై విష పూరిత ద్రవాల్ని స్రవిస్తాయి. ఈ కప్పలను బ్రెజిల్‌లో మారుమూల అటవీ ప్రాంతంలోని పర్వత శిఖర ప్రాంతంలో గుర్తించారు. ఈ ప్రాంతం జనావాసాలకు చాలా దూరంగా ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితులు, అడవుల నరికివేతతోపాటు అరణ్యంలోని పశువుల కింద పడడం వల్ల ఇవి కూడా అంతరించే దశకు చేరుకున్నాయని బ్రెజిల్ పరిశోధకుడు మార్కియో పై తెలిపారు. ఈ కప్పలు బ్రాకెసైఫాలస్ జాతికి చెందినవన్నారు.  19వ దశకం నుంచే ఇవి ఇక్కడ నివసిస్తుండవచ్చని ఆయన చెప్పారు. ఇలాంటి కప్ప జాతులు బ్రెజిల్ అడవుల్లో ఇంకా ఉండే అవకాశముందన్నారు.

‘హెల్‌బాయ్’ డైనోసార్ గుర్తింపు
కెనడాలో కొత్త జాతి డైనోసార్‌ను శాస్త్రవేత్తలు గుర్తిం చారు. దశాబ్దం క్రితం ఓల్డ్‌మన్ అనే నదీ తీరంలో డైనోసార్‌కు చెందిన కొన్ని ఎముకల్ని గుర్తించారు. ఈ ఎముకల నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రజ్ఞులు డైనోసార్ పుర్రె భాగంలో ఓ కొమ్ము ఉండేదని కనుగొన్నారు. అందుకే దీనికి పరిశోధకులు ముద్దుగా ‘హెల్‌బాయ్ డైనోసార్’ అని పేరు పెట్టారు. ఇది అరుదైన ట్రైసరాటోప్స్ కుటుంబానికి చెందినదని, ఈ కుటుంబం గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉందని రాయల్ టిర్రెల్ మ్యూజియమ్ పరిశోధకులు తెలిపారు.

మరిన్ని వార్తలు