వృద్ధుల కోసం జీపీఎస్ బ్రాస్లెట్‌లు..

4 Dec, 2016 00:58 IST|Sakshi
వృద్ధుల కోసం జీపీఎస్ బ్రాస్లెట్‌లు..

సాధారణంగా ఒక వయసు వచ్చిన వ్యక్తులకు మతిమరుపు రావడం చాలా సహజం. అది ఒక పరిధి వరకైతే ఒకే కానీ తమ సొంత ఇంటి అడ్రస్‌ను సైతం మర్చిపోయేలా ఉంటే మాత్రం ఎంతో ప్రమాదం. కాబట్టి మతిమరుపు లాంటి సమస్యలతో బాధ పడుతున్న వృద్ధుల కోసం చైనా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ఇంటి నుంచి బయటకెళ్లిన వృద్ధులు మళ్లీ ఇళ్లు చేరడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించి.. వారికి ప్రత్యేక బ్రాస్లెట్‌లు ఇవ్వాలని నిర్ణరుుంచారు.

జీపీఎస్‌తో కూడిన ఆ బ్రాస్లెట్లను వృద్ధులు ధరిస్తే వారు దారి తప్పిపోరుున లేక అడ్రస్ మర్చిపోయిన వారిని గుర్తించడం సులభమవుతుందని బీజింగ్ డిప్యూటీ మేయర్ వాంగ్ నింగ్ తెలిపారు. మతిమరుపు సమస్యలున్న 12,000 మంది వృద్ధులకు త్వరలోనే ఈ బ్రాస్లెట్‌లను పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. వృద్ధులకు సంబంధించిన వారు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా వారి ఆచూకీని తెలుసుకోగలరని తెలిపారు. అంతే కాదు ఆ బ్రాస్లెట్‌తో వృద్ధులు ఎమర్జెన్సీ కాల్స్ సైతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2015లోని సమాచారం ప్రకారం చైనా జనాభాలో 22 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడినవారే.

>
మరిన్ని వార్తలు