కనికరించి వదిలేయండి ట్రంప్‌.. కిమ్‌ విజ్ఞప్తి!

31 May, 2018 10:26 IST|Sakshi

వాషింగ్టన్‌ : హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్, నటి కిమ్ కర్దాషియన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకున్నారు. తన గ్రాండ్‌ మదర్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ను ఆమె కోరారు. అలైస్‌ మేరీ జాన్సన్‌ (63)ను అమెరికా పోలీసులు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. అయితే ఇటీవల ట్రంప్‌ ఓ బాక్సర్‌కు క్షమాబిక్ష ప్రసాదించగా.. తన గ్రాండ్‌ మదర్‌పై కూడా కనికరం చూపాలని నటి కర్దాషియన్‌ ట్రంప్‌ను కోరారు.

గతేడాది నుంచి ఇప్పటివరకూ పలు పర్యాయాలు ట్రంప్‌ అల్లుడు జరేడ్‌ కుష్నర్‌ నటి కర్దాషియన్‌తో మేరీ జాన్సన్‌ కేసు గురించి చర్చించారు. తాజాగా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి డ్రగ్స్‌ కేసుపై మరోసారి విచారణ జరిపి మేరీ జాన్సన్‌కు విముక్తి కల్పించాలని కర్దాషియన్‌ విజ్ఞప్తి చేశారు. కర్దాషియన్‌తో సమావేశం గొప్పగా జరిగిందని, జైలు శిక్ష, సంస్కరణలు మార్పులపై చర్చించినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

బుధవారం (మే 30న) నిందితురాలు మేరీ జాన్సన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె మనవరాలు కిమ్‌ కర్దాషియన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 1996లో డ్రగ్స్‌ కేసు ఆరోపణలతో మోడల్‌ అయిన జాన్సన్‌కు పెరోల్‌ కూడా ఇవ్వకుండా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు దశాబ్దాలుగా జాన్సన్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఆమె విషయంలో ఇప్పుడైనా ఓ మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్‌ను కలుసుకున్న నటి కిమ్‌ కర్దాషియన్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు