అక్కడికి వెళితే నెలకు 40వేలు ఇస్తారు!

4 Jul, 2019 11:18 IST|Sakshi

గ్రీక్‌ ద్వీపం వెరైటీ ఆఫర్‌..

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి.. అక్కడ మనం నివసించాలంటే.. మనమే ఎంతకొంత అద్దె కట్టాల్సి ఉంటుంది.  కానీ, మీరు వచ్చి మా ద్వీపంలో నివసిస్తే చాలు.. బదులుగా మేమే మీకు నెలకు రూ. 40వేలు చెల్లిస్తామని ఆఫర్‌ ఇస్తోంది ఓ దేశం. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. గ్రీస్‌ దేశంలోని అంటీకైథెరా ద్వీపానికి వెళ్లి నివసిస్తే.. నెలకు 450 పౌండ్లు (రూ. 40వేలు) అక్కడి స్థానిక ప్రభుత్వం చెల్లించనుంది. ఈ ద్వీపంలో నివసించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

మధ్యధర సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య అంటీకైథెరా ద్వీపం ఉంది. ప్రస్తుతం ఈ ద్వీపంలో 24మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవికాలం వస్తే ఇక్కడ నివసించే వారి సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. అంతగా ఆధునీకరించని ఈ చిన్నీ నివాసయోగ్యమైన ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుందని, అయితే, అపారమైన విశ్రాంతి, విహారాలకు ఈ ద్వీపం నెలవని అంటీకైథెరా అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంటుంది. శీతకాలంలో తమ ద్వీపం ఎంతో అందంగా ఉంటుందని, ఆ సమయంలో ఇక్కడ గడపడం కొంచెం కష్టమైనా.. ఎక్కువ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసించాలని, మళ్లీ ఈ ద్వీపం పునర్‌వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు ద్వీపం మేయర్‌ స్థానిక మీడియాకు తెలిపారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రంప్‌కు ప్రిన్స్‌హ్యారీ, మార్కెల్‌ కౌంటర్‌

11,591 మరణాలు.. లాక్‌డౌన్‌ లేనట్లయితే!!

10 లక్షల మందికి టెస్టులు.. ఇటలీకి భారీ సాయం!

కరోనా: ఆ మూడు దేశాల్లో 22 వేల మంది మృతి

డ్రైవింగ్‌ సీట్లో కుక్క..160 కి.మీ వేగంతో కారు!

సినిమా

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు