ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

29 Jul, 2019 15:44 IST|Sakshi

ఈబీ-5 వీసా కలలు మరింత భారం

పెట్టుబడి పరిమితి  భారీగా పెంపు

ఈబీ-కొత్త  నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలు 

అమెరికాలో విదేశీ వ్యాపారులకుద్దేశించిన వీసాపై  అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈబీ-5 గా పిలిచే ఈ వీసాలకు సంబంధించి కనీస పెట్టుబడిన 50 వేల డాలర్లను అమాంతం 90 వేల డాలర్లకు పెంచింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 21కంటే ముందుగానే అమల్లోకి రానున్నాయి. దీంతో ఈబీ- 5 వీసాదారుల గ్రీన్ కార్డు కల చెదిరిపోనుంది. యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ ప్రచురించిన కొత్త నియమం ప్రకారం ఈ మార్పులు నవంబర్ 1, 2019 నుండి అమల్లోకి వస్తాయి. 

అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే ఈబీ-5 వీసాలకు సంబంధించి విదేశీ పెట్టుబడిదారులకు పెట్టుబడి పరిమితి టార్గెటెడ్‌ ఎంప్లాయిమెంట్‌ ఏరియ(ఏఈఏ)లో కనీసం 5 లక్షల డాలర్లు (సుమారు రూ.3.45 కోట్లు) గా ఉండేది. తాజా నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని 9 లక్షల డాలర్లకు (సుమారు రూ.6.21 కోట్లు) పెంచారు. అలాగే ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్ణయించే ప్రామాణిక కనీస పెట్టుబడుల పరిమితినీ 10 లక్షల డాలర్ల (రూ.6.9 కోట్లు) నుంచి 18లక్షల డాలర్లకు (రూ.12.42 కోట్లు) పెంచింది  ట్రంప్‌ ప్రభుత్వం.

ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డ్ పొందటానికి, చట్టబద్ధమైన శాశ్వత నివాసితులుగా ఉండటానికి, చివరికి అమెరికా పౌరులుగా మారడానికి వీలు కల్పిస్తుంది. పెట్టుబడి పెట్టుబడిదారుడు శాశ్వతంగా జీవించడానికి గ్రీన్ కార్డుకు దారితీస్తుంది. దీనిద్వారా పెట్టుబడిదారుడు జీవిత భాగస్వామి, పెళ్లికాని పిల్లలతో యుఎస్‌లో ఉండొచ్చు. అమెకికా  సిటిజెన్‌షిప్‌ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దీన్నినిర్వహిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను సులభతరం చేయడానికి 1990  ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. అయితే నిబంధనలతో ఈ వీసాపై అగ్రరాజ్యంలో స్థిర పడాలనుకునే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది ట్రంప్ సర్కార్. దీంతో ప్రధానంగా ఎక్కువ మంది భారతీయులకే ఇబ్బందిగా మారనుందని అంచనా.  ఈ వీసాలకు భారతీయుల దరఖాస్తులు 10-15 శాతం తగ్గనుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు