పెళ్లి కావాలంటే అత్తతో దెబ్బలు తినాల్సిందే..

17 Mar, 2018 16:10 IST|Sakshi

పెరూ: పై ఫొటోలో యువకుడిని ఓ మహిళ కర్రతో చితకబాదుతోంది. ఆ దెబ్బలను యువకుడు ఓపిగ్గా భరిస్తున్నాడు. ఇంతకీ సదరు యువకుడు చేసిన పని ఏంటో తెలుసా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును నిజమే.. ఫోటోలో ఉన్న మహిళ కూతురినే ఆ యువకుడు వివాహం చేసుకోవాలి. కాబోయే అల్లుడిని.. ఆమె ఎందుకు కొడుతోంది అనుకుంటున్నారా.. ఏం లేదు దక్షిణ అమెరికాలోని పెరూలో ఓ వింత ఆచారముంది.

పెళ్లి కొడుకు గురించి తెలుసుకునేందుకు అక్కడ కఠినమైన పరీక్ష పెడతారట. అదే ఈ పరీక్ష. పెళ్లికి ముందే కాబోయే అల్లుడిని అత్త కర్రతో చావబాదుతుంది. ఈ పరీక్ష ద్వారా అతను బాధ్యత గల వ్యక్తా.. మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా.. ఇలాంటి పలు విషయాలను నిర్ధారించుకుంటారట. ఈ పరీక్షలో నెగ్గితేనే తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తారట. చూడటానికి వింతగా ఉన్నా, ఈ ఆచారాన్ని పెరూలో చాలా ఏళ్లుగా అక్కడి వాళ్లు పాటిస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు