నా జీవితంలో ఇంకెప్పుడూ సంతోషంగా ఉండలేను

18 Aug, 2019 17:21 IST|Sakshi

కాబూల్‌ : ‘‘బంధువుల సందడి, అతిధుల పలకరింపులు ఇవన్నీ గుర్తుచేసుకుంటుంటే ఎంతో బాధగా ఉంది. ఈ సంఘటన నన్ను సంతోషం నుంచి దూరం చేసి విషాదంలోకి నెట్టివేసింది. నా కుటుంబం, పెళ్లి కూతరు అందరూ షాక్‌లో ఉన్నారు. పెళ్లి కూతురైతే ఇప్పటికీ వణికిపోతోంది. నా తమ్ముడ్ని, స్నేహితులను, బంధువులను కోల్పోయాను. నా జీవితంలో ఇకపై నేనెప్పుడూ సంతోషంగా ఉండలేను. గాయపడిన వారిలో ఆడవాళ్లు, పిల్లలు కూడా ఉన్నారు. దాడి జరగటానికి ముందు పెళ్లికి వచ్చిన అతిధులు ఆనందంతో డ్యాన్స్‌ చేస్తూ ఉన్నారు. క్షణాల్లో అంతా నాశనమైపోయింది. అందరూ కేకలు వేస్తూ తమ వాళ్లకోసం ఏడుస్తూ వెతుకుతూ ఉన్నారు. దాడి జరిగిన తర్వాత మేము స్పృహలో లేము! మమ్మల్ని ఎవరు ఆసుపత్రికి తీసుకొచ్చారో కూడా తెలియదు.’’ అంటూ తన పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న తీరని విషాదంపై పెళ్లికుమారుడు మిర్‌వేస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి ముందు చోటుచేసుకున్న మధురమైన సంఘటనలను నెమరువేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

కాగా, అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం రాత్రి పెళ్లి వేడుకల్లో జరిగిన ఆత్మాహుతి దాడి పెను విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. పేలుడు దాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడటం అందరినీ కలిచివేసింది.

చదవండి : పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి

మరిన్ని వార్తలు