కారులో గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి చేశాడని చితకబాదారు

22 Jan, 2020 11:14 IST|Sakshi

కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో గత శుక్రవారం ఒక కన్వెన్సన్‌ హాల్‌లో ఫ్యూరీ కాంపిటీషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఫర్రీస్‌ అంటే వివిధ రకాల జంతువులను పోలిన వేషదారణతో కల్పిత పాత్రలను ధరించి కథలు, నాటకాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఫర్రీస్‌ వేషం ధరించిన ఇద్దరు వ్యక్తులు సిగరేట్‌ తాగేందుకని బయటకు వచ్చారు. అప్పుడే వారి ముందు ఒక నీలం రంగు కారు వెళ్లి కొంచెం దూరంలో ఆగింది. ఆ తరువాత కారులోంచి ఎవరో అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించడంతో దగ్గరికి వెళ్లి చూశారు.

కారులో ఒక యువకుడు తనతో పాటు ఉన్న యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో కారు డోరును తెరిచే ప్రయత్నం చేయగా అది రాకపోవడంతో లోపల ఉన్న యువతి అతన్ని నెట్టివేసి డోర్‌ అన్‌లాక్‌ చేసింది. దీంతో లోపల ఉన్న వ్యక్తిని ఇద్దరు కలిసి బయటికి లాగారు. ఆమెను ఎందుక​లా కొడుతున్నావని ప్రశ్నింస్తుండగానే వారిపై దాడికి దిగాడు. దీంతో ఫర్రీస్‌ అతని ఈడ్చి కిందపడేసి పిడిగుద్దుల వర్షం కురింపించారు. విషయం తెలుసుకున్న మరో ఇద్దరు కూడా వీరిద్దరికి తోడయ్యి అతనిపై దాడి చేశారు. కాగా సమాచారం అందుకున్న శాన్‌జోస్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారందరిని విడిపించి అతన్ని అరెస్టు చేశారు.

అరెస్టైన వ్యక్తి పేరు డెమిట్రీ హార్డ్‌నెట్‌ అని, అతనికి 22 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తన గర్ల్‌ప్రెండ్‌ను కారులో ఇష్టమొచ్చిన రీతిలో కొట్టడంతో ఫ్యూరిస్‌ వేషదారులు ఎందుకలా కొడుతున్నావు అని ప్రశ్నింనందుకు వారిపై దాడి చేశాడని, అందుకే తిరిగి ప్రతిదాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. కాగా డెమిట్రీ హార్డ్‌నెట్‌పై గృహహింస కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇదంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఫర్రీస్‌ చేసిన పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు