‘లిగో’ మ్యాజిక్‌..

14 Apr, 2019 09:52 IST|Sakshi

మ్యాజిక్‌ బ్రిక్స్‌ తెలుసా..? అదేనండీ ప్లాస్లిక్‌తో తయారైన ఇటుకల వంటి ముక్కలను ఒకదానిపై ఒకటి పేర్చి బొమ్మలు తయారు చేస్తుంటారు. చిన్న పిల్లలకు ఇవంటే మహా సరదా.. వాటినే లిగో బ్రిక్స్‌ అని కూడా అంటారు. ‘స్టార్మ్‌ ట్రూపర్‌’ ఆకారంలో ఉన్న చిన్న చిన్న బ్రిక్స్‌తో లిగో గ్రూప్‌ కంపెనీ ‘స్టార్మ్‌ ట్రూపర్‌’ పెద్ద ఆకారాన్ని తయారు చేసి ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది. 6,440 లిగో బ్రిక్స్‌తో ఈ పెద్ద ఆకారాన్ని తయారు చేశారు. అమెరికాలోని షికాగోలో జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ మైఖెల్‌ మెక్‌ నాలీ ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.


 

మరిన్ని వార్తలు