మస్కట్‌లో  ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరణ

3 Oct, 2019 19:29 IST|Sakshi

గల్ఫ్‌ డెస్క్‌: గల్ఫ్‌ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతీవారం ‘సాక్షి’ జిల్లా పేజీల్లో ‘గల్ఫ్‌ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్‌ 2017 న ప్రారంభమైన ఈ పేజీ 22 నెలలుగా.. ఈ సెప్టెంబర్‌ 2019 వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్‌ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 15 జూన్‌ 2018 నుంచి గల్ఫ్‌ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది.

ఈ పేజీలో గల్ఫ్‌ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలపై, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమన్‌ రాజధాని మస్కట్‌లో 4 అక్టోబర్‌ 2019న నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా 83 వారాల పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం సంతోషం. ‘మైగ్రేంట్‌ ఫోరం ఇన్‌ ఏసియా’ సభ్య సంస్థ అయిన ‘ఎమిగ్రేంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం’ తెలంగాణ వలసల చరిత్రలతో ఈ ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం గుర్తుండిపోయే ఘట్టం అని చెప్పవచ్చు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా