హెచ్-1బీ వీసా : ప‌రిమితి ముగిసింది

30 Mar, 2020 10:21 IST|Sakshi

అమెరికాలో ప‌నిచేసేందుకు వృత్తి నిపుణుల‌కిచ్చే  వీసా హెచ్1-బీ 

మార్చి 31 లోపు వివరాలు అందిస్తాం- యూఎస్‌సీఐఎస్

 వాషింగ్టన్ : వ‌చ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి హెచ్1-బీ ద‌ర‌ఖాస్తుల ప‌రిమితి ముగిసింద‌ని యూఎస్‌సీఐఎస్(యూఎస్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్) వెల్ల‌డించింది. ఎవ‌రి ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించాల‌నే విష‌యంపై లాట‌రీ ద్వారా నిర్ణ‌యిస్తామ‌ని కౌన్సిల్ తెలిపింది.  ఎంపికైన వారి వివరాలను ఆయా దరఖాస్తుదారులు,  వారి సంస్థలకు మార్చి 31 లోపు  సమాచారాన్ని అందిచేస్తామని  ప్రకటించింది. అలాగే హెచ్1-బీ  క్యాప్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30వ తేదీని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ నిర్దేశించిన 65 వేల దరఖాస్తుల స్వీకరణ పరిమితి మించిందని తెలిపింది. అయితే ఎంత మంది హెచ్-1బీ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేశార‌నే విష‌యాన్ని యూఎస్‌సీఐఎస్ ప్ర‌క‌టించ‌లేదు.  భార‌త్, చైనా దేశాల నుంచి వేల మంది ఐటీ నిపుణులు ఎక్కువ‌గా హెచ్1-బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుండ‌టం తెలిసిన విష‌య‌మే. 

మరిన్ని వార్తలు