హెచ్‌1బీ వీసా దరఖాస్తు రుసుం పెంపు

9 Nov, 2019 04:17 IST|Sakshi

వాషింగ్టన్‌: ఎంపిక ప్రక్రియ సమీక్షలో భాగం గా అమెరికా హెచ్‌1బీ వీసా దరఖాస్తు రుసుంను రూ. 700 (10 డాలర్లు) పెంచుతున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికాలో విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది. పెంపు ద్వారా వచ్చే నిధులను ఎంపిక ప్రక్రియను ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వినియోగిస్తామంది. దీనివల్ల ఇమిగ్రేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు