తిమింగలాల కోసం ..

10 Dec, 2015 17:15 IST|Sakshi
టోక్యో:  జపాన్ లో మరోసారి అధికారిక వెబ్సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తాజాగా  గురువారం  ప్రధాన మంత్రి షింజో అబే అధికారిక వెబ్సైట్‌ను హాకర్స్ క్రాష్ చేశారు. దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న తిమింగలాల వేటను నిరసిస్తూ ఈ చర్యకు పూనుకున్నామని  ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి  కూడా ధృవీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ వెబ్సైట్‌ను హ్యాక్ చేసినట్లు ట్విట్టర్  ద్వారా తెలిపారన్నారు. త్వరలోనే సైట్ ను పునరుద్ధరిస్తామని క్యాబినెట్ ముఖ్యకార్యదర్శి యోషిండే సుగా ప్రకటించారు. 
 
తిమింగలాలను వేటాటడం సరైంది కాదని, అంతరించి పోతున్న తిమింగలాల జాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై  ఉందని హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన వెబ్సైట్  దాడులకు తమదే బాధ్యత అని కూడా ఆ గ్రూపు ప్రకటించింది. కాగా తిమింగాల వేటపై  అనేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వార్తలు