క్షమాపణ చెప్పకుంటే రూ. 5 కోట్లు కట్టండి

7 Jan, 2018 03:56 IST|Sakshi

లాహోర్‌: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ పాక్‌ రక్షణమంత్రి దస్తగీర్‌కు రూ.5.70 కోట్ల(10 కోట్ల పాకిస్తానీ రూపాయలు) పరువునష్టం నోటీసులిచ్చాడు.  ‘పాఠశాల విద్యార్థులపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరపకుండా ఉండేందుకే జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్‌లకు విరాళాలపై నిషేధం విధిస్తున్నాం’ అని ఇటీవల దస్తగీర్‌ అన్నారు. దీంతో  ‘ఈ విషయమై నా క్లయింట్‌(సయీద్‌)కు 14 రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణ చెపాల్పి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని దస్తగీర్‌ మాటివ్వాలి. లేదంటే పాకిస్తాన్‌ శిక్షాస్మృతి సెక్షన్‌ 500 కింద కోర్టును ఆశ్రయిస్తాం’ అని సయీద్‌ న్యాయవాది నోటీసులు జారీచేశారు. 

మరిన్ని వార్తలు