భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

22 Jan, 2017 11:30 IST|Sakshi
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

పోర్ట్ మోర్స్‌బై‌: పపువా న్యూ గినియా తీర ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. పన్‌గున ఐలాండ్‌లో, బౌగన్‌విల్లే ఐలాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో న్యూగినియాకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసున్నాయి. పపువా న్యూ గునియా తీరంలో, సోలమన్ ఐలాండ్, నౌరు, కోస్రే, వనౌతు, ఇండోనేషియాలపై ఈ భూకంప ప్రభావం ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 95.5 మైళ్లు లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఈ దీవులు ఉండటంతో తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే. జియోలాజికల్ సర్వే సునామీ వార్నింగ్‌తో న్యూ గినియా అధికారులు అప్రమత్తమయ్యారు. చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

మరిన్ని వార్తలు