అరుదైన జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు

24 Oct, 2018 10:39 IST|Sakshi

కాన్‌బెర్రా : దక్షిణాది మహాసముద్ర జలాల్లో మొట్టమొదటిసారిగా సముద్రపు అరుదైన జీవి ఎనీప్నియాస్టీస్‌ ఎగ్జీమియాను కనుగొన్నామని ఆస్ట్రేలియా అంటార్కిటిక్‌ డివిజన్‌ తెలిపింది. అండర్‌వాటర్‌ కెమెరా టెక్నాలజీ ద్వారా తూర్పు అంటార్కిటికాలో ఈ అరుదైన జీవి ఉనికిని కనుగొన్నామని పేర్కొంది. హెడ్‌లెస్‌ చికెన్‌ మాన్‌స్టర్‌, స్పానిష్ డాన్సర్‌, హెడ్‌లెస్‌ చికెన్‌ ఫిష్‌గా పిలుచుకునే ఈ జీవిని మొదట మెక్సికో సింధుశాఖలో కనుగొన్నారు.

కాగా హెడ్‌లెస్‌ చికెన్‌ మాన్‌స్టర్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. సముద్రపు అంతరాల్లో నిక్షిప్తమైన ఇటువంటి అరుదైన సంపదను చూసే వీలు కల్పించినందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలకు నెటిజన్లు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ‘మనకు తెలియని విషయమేదీ లేదంటూ మనలో కొంతమంది అనుకుంటారు. కానీ ప్రకృతి చాలా విచిత్రమైందని ఇటువంటి సంఘటనల ద్వారా నిరూపితమవుతుంది కదా’ అంటూ ప్రకృతి ప్రేమికులు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు