కొవ్వులందు ట్రాన్స్‌ఫ్యాట్లు వేరయా!

5 Jun, 2018 01:32 IST|Sakshi

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌.. మనం తినే కొవ్వుల్లో అత్యంత ప్రమాదకారి. ఆరోగ్యాన్ని హరిస్తోంది. ప్రాణాలను పిప్పి చేస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొవ్వులపై యుద్ధం ప్రకటించేసింది. ఆహారంలో ఈ కొవ్వులు అనేవి లేకుండా చూడాలని.. 2023 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ వాడకాన్ని ఆపేయాలంటూ డెడ్‌లైన్‌ విధించింది. ఈ నేపథ్యంలో అసలు ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎలా ఏర్పడతాయి? వాటి వల్ల కలిగే దుష్పరిణామాలేంటో చూద్దాం.


ఎలా ఏర్పడతాయి?
వంటనూనెలను వేడి చేసినప్పుడు నీరు లేదా తేమ కలిస్తే ఏర్పడతాయి

ఎందుకు వాడతారు?
ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వఉంచడానికి ఆహారపు రుచిని పెంచేందుకు  

సహజంగానూ ఉంటాయా?
మాంసం, పాల ఉత్పత్తుల్లో ప్రకృతి సహజంగా ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉంటాయి.


కృత్రిమ ట్రాన్స్‌ఫాట్స్‌ అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలు
కేకులు, పేస్ట్రీలు బ్రెడ్, బిస్కెట్లు ,శాండ్‌విచ్‌, చాక్లెట్స్, వేఫర్స్‌,మైక్రోవేవ్‌ పాప్‌కార్న్‌,పిజ్జా, ఐస్‌క్రీమ్‌,ఫ్రెంచ్‌ ఫ్రైస్, ఫ్రైడ్‌ చికెన్‌  ,రెడీ టు ఈట్‌ ఆహార పదార్థాలు  

ట్రాన్స్‌ఫ్యాట్స్‌పై నిషేధం ఉన్న దేశాలు
డెన్మార్క్, స్విట్జర్లాండ్,కెనడా, బ్రిటన్‌ అమెరికా

ట్రాన్స్‌ఫ్యాట్స్‌ వినియోగంతో వచ్చే వ్యాధులు
మధుమేహం ,గుండె సంబంధిత వ్యాధులు ,కేన్సర్‌  

భారత్‌ ప్రణాళికలు
ట్రాన్స్‌ఫాట్స్‌ కలిగిన వెజిటబుల్‌ ఆయిల్స్, వెజిటబుల్‌ ఫ్యాట్, హైడ్రోజెనేటెడ్‌ వెజిటబుల్‌ వాడ కాన్ని 2 శాతానికి తగ్గించాలని భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ప్రతిపాదిస్తోంది. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఫుడ్‌ ప్రోసెసింగ్‌ కంపెనీలు ఇప్పటివరకు 5% వరకు వాడ వచ్చని నిబంధనలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు