విమానాలే లక్ష్యంగా డ్రోన్ల ప్రయోగం

13 Sep, 2019 20:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ కోసం గత ఏప్రిల్‌ నెలలో లండన్‌ వీధులను పూర్తిగా స్తంభింప చేసిన ఆందోళనకారులు గత కొన్ని రోజులుగా లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆందోళనకారులు శుక్రవారం నాడు కొత్త ఎత్తుగడ వేశారు. విమానాశ్రయం రన్‌వేపైకి డ్రోన్లను పంపించేందుకు ప్రయత్నించారు. జామర్ల ద్వారా వారి ప్రయత్నాలను అడ్డుకున్న బ్రిటిష్‌ పోలీసులు ఓ మహిళ సహా ముగ్గురు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. 

ఈ రోజు తెల్లవారు జామన మూడున్నర గంటల సమయంలో ఆందోళనకారులు డ్రోన్లను ఎగరేస్తున్నట్లు తెలియజేసే ఓ వీడియాను విడుదల చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారి ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకున్నారు. డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థను గతేడాదే ఇజ్రాయెల్‌ నుంచి బ్రిటన్‌ కొనుగోలు చేసినట్లు గత ఆగస్టులోనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు బ్రిటన్‌ పోలీసులు ఆ వ్యవస్థను ఉపయోగించే ఆందోళనకారుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. డ్రోన్లను ఎగురవేసే ఆందోళనలో 35 మంది కార్యకర్తలు పాల్గొన్నట్లు ఆందోళనకారులు చెబుతుంటే ఐదారుగురికి మించి ఉండరని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు