అమెరికాలో భారీ తుపాను

19 Feb, 2017 02:34 IST|Sakshi

లాస్‌ ఏంజిలెస్‌: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో తుపాను ధాటికి శుక్రవారం నలుగురు మృతిచెందారు. విద్యుదాఘాతంతో ఒకరు, కారు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా... కారు నీట మునగడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తుపాను కారణంగా 300 విమానాలను రద్దు చేశారు.

పలు జాతీయ రహదారులను మూసివేశారు. విద్యుత్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. పలు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి. కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 70 కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి.

మరిన్ని వార్తలు