వదలని వాన.. 43 మంది మృతి..!

14 Jul, 2019 11:25 IST|Sakshi

పట్నా : గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొరుగు దేశం నేపాల్‌ అతలాకుతలమైంది. నదుల్లో వరద పొంగిపొర్లడంతో కొండప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర ముప్పు నెలకొంది. ఇప్పటికే అక్కడ 43 మంది వరదల్లో చిక్కుకుని మృతి చెందగా.. మరో 24 మంది గల్లంతయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. లలిత్‌పూర్‌, ఖోతంగ్‌, భోజ్‌పూర్‌, కావ్రే, మాక్వాన్‌పూర్‌, సిందూలి, ధాదింగ్‌ ప్రాంతాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఎడతెగని వర్షాల కారణంగా నేపాల్‌ సరిహద్దు రాష్ట్రమైన బిహార్‌లోని 6 జిల్లాలు వరదమయమయ్యాయి. సుపాల్‌, మజఫర్‌పూర్‌, తూర్పు చంపారన్‌, పశ్చిమ చంపారన్‌, అరారియా, కిషన్‌ గంజ్‌ జిలాల్లోలోని ప్రజల్ని స్థానిక యంత్రాంగం, జాతీయ విపత్తు సహాయక బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్‌) సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

ఆదివారం కూడా నేపాల్‌లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కోషి, గండక్‌, బుది గండక్‌, గంగ, భాగమతి నదుల్లో వరద ఉధృతి పెరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫైనల్లో పరాజితులు లేరు 

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!