ఘోర ప్రమాదం : నేపాల్‌ మంత్రి దుర్మరణం

27 Feb, 2019 15:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌

విమానయాన మంత్రి రబీంద్ర అధికారి, సహా ఏడుగురు మృతి

ఖట్మాండు : భారత, పాకిస్తాన్‌ దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే సరిహద్దు దేశం నేపాల్‌లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ కుప్పలి కూలిన ఘోర ప్రమాదంలో ఆ దేశ విమానయాన శాఖమంత్రి, మరో ఏడుగురు దుర‍్మరణం చెందారు .టాపెజంగ్ జిల్లాలోని పాతిభారా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

నేపాల్‌ పర్యాటక రంగం, పౌర విమానయాన శాఖ మంత్రి రబీంద్ర అధికారి, మరో ఏడురు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. హెలికాప్టర్ పైలట్‌తోపాటు మంత్రి భద్రతా సిబ్బంది అర్జున్ గిమిరే, పర్యాటక వ్యాపారి, యతి ఎయిర్‌లైన్స్‌ డైరెక్టర్‌,ఎయిర్‌ డైనాస్టీ ఛైర్మన్  ఆంగ్‌ చింగ్ షెర్పా, ప్రధాని దగ్గరి  బంధువు యబ్బరాజ్ దహల్, సివిల్‌ ఏవియేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌  బీరేంద్ర శ్రేష్ట,  మరో వ్యక్తి మరణించారు. 

విమానయాన మంత్రి ఇతర అధికారులతో కలిసి పతిభార దేవాలయాన్నిసందర్శించి, చుహన్ దండలో విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించటానికి వెళుతున్నట్టుసమాచారం. ఈ ప్రాంతంలో భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగ  అలుముకున్నాయని స్థానికులు తెలిపారని స్థానికఅధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో క్యాబినెట్‌ అత్యవసర సమావేశానికి నేపాల్‌ ప్రధానమంత్రి  పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు