హవ్వా.. మత్తులో ఇలా కూడా చేస్తారా..?

21 Jun, 2017 13:20 IST|Sakshi
హవ్వా.. మత్తులో ఇలా కూడా చేస్తారా..?

సిడ్నీ: మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానీకరం అంటారు. ఆరోగ్యమే కాదు.. అది ఆలోచనకు కూడా వినాశిని. విచక్షణ కోల్పోయి ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉండే మనసును కకావికలం చేసి మొత్తాన్ని ఎదుటివారి వినాశనానికో లేద తన నాశనానికో దారి తీస్తుంది. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి అదే అనుభవం ఎదురైంది. అప్పటి వరకు తమ కళ్ల ముందున్న స్నేహితుడు కనిపించకుండా పోయిన పరిస్థితి ఎదురై చివరకు చనిపోయాడులే అని నిర్ణయించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. తీవ్రంగా మత్తుపదార్థాలతో నిండిన పొగతాగడం మూలంగా ఓ ఆస్ట్రేలియన్‌ వికృత ఆలోచన చేసి బలయ్యాడు. ఏకంగా మొసలితో సంపర్కాన్ని కోరుకుని దాని నోట్లు ఇరుక్కుని చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ఓ 26 ఏళ్ల యువకుడు తన ఐదుగురు స్నేహితులతో కలిసి బీచ్‌ దగ్గర రిసార్ట్‌ దగ్గర పార్టీ చేసుకుంటూ ఫుల్లుగా మద్యం సేవించి అనంతరం మత్తుపొగను తాగాడు. దాంతో అప్పటి వరకు క్రమబద్ధంగా ఉన్న ఆ వ్యక్తి కాస్త అదుపు తప్పాడు. వెంటనే తన మనసులో మాట బయటకు చెప్పి వారి మత్తు దిగిపోయేలా చేశాడు. తనకు మొసలితో అలాంటి పనిచేయాలని ఉందంటూ బిత్తరపోయేట్లు చేశాడు. వారి వద్దని వారిస్తున్నా వారిపైకి సీరియస్‌గా చూస్తూ ఓ సైకోలాగా చేస్తూ అదే మాటను పదేపదే చెప్పాడు. స్నేహితుడు కావడంతో వారి మరోసారి అతడిని వారించే ప్రయత్నం చేసినా వారి నుంచి విడిపించుకొని బీచ్‌ వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాడు.

ఎప్పుడైతే అతడికి మొసలి కనిపించిందో వెంటనే తన దుస్తులన్నీ విప్పేసి దాని దగ్గరకు వెళ్లాడు. ఏమాత్రం భయపడకుండా వెళ్లి నేరుగా దానిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా ఆ స్నేహితులకు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగింది. వారు అతడిని నివారించేలోగానే వెంటనే ఆ ముసలి అతడిని అందుకొని నీళ్లలోకి వెళ్లిపోయింది.

అతడు చనిపోయాడా బతికాడా అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. అతడికోసం తనిఖీలు నిర్వహించిన గస్తీ బలగానికి కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో అతడు చనిపోయాడని నిర్దారణకు వచ్చారు. అసలు అతడలా వికృతంగా ఎలా ఆలోచించాడని ఆరా తీయగా వారు సేవించిన మత్తుపదార్థాల్లో విపరీతంగా లైంగిక వాంఛలు పెంచేందుకు అనువైన ఐస్‌ అనే పదార్థం ఉందని తెలిసింది. ఇలా మత్తులో పడి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడనే సోయి కూడా లేకుండా నిండూ జీవితాన్ని బలి తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు