భయంకర ఇసుక తుఫాను!

19 May, 2016 12:23 IST|Sakshi
భయంకర ఇసుక తుఫాను!

చైనాః హాలీవుడ్ సన్నివేశాలను తలపించే భయంకర ఇసుక తుఫాను  కస్గర్ నగరాన్ని వణికిస్తోంది. చైనా జిన్జియాంగ్ ఇగూర్ అటనమస్ ప్రాంతంలోని కాష్గర్ ఫ్రిఫెక్చర్ లో సంభవించిన ఇసుక తుఫానుతో అక్కడి గృహాలన్నీ కప్పడిపోయాయి. 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తున్న ఇసుక... అతి పెద్ద భవనానలను సైతం కప్పేస్తుండటంతో పరిస్థితి అతి భయానకంగా మారిపోయింది.

కాష్గర్ పరిస్థితిని సమీక్షించిన స్థానిక వాతావరణ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికగా  అరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. వాయువ్య చైనా జిన్జియాంగ్ ఇగూర్ ప్రాంతంలో ఏర్పడ్డ తీవ్ర ఇసుక తుపానుతో.. టంగ్జంక్ నగరం, మిన్ ఫెంగ్ కౌంటీలు భారీ ఇసుక కెరటాల్లో చిక్కుకుపోయాయి.  ఆ రెండు ప్రాంతాలూ ఇసుక కెరటాలతో తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో అధికారులు స్థానికులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళనుంచి బయటకు రావద్దని హెచ్చిరికలు జారీ చేశారు.

అక్కడి పరిస్థితిపై స్థానికులు చిత్రించిన వీడియో ఇప్పడు యూట్యూబ్ వినియోగదారుల్లో ఆత్రుతను నింపుతోంది. తుఫాన్లతో నీటికి కొట్టుకుపోయే నగరాలను చూసేందుకే అలవాటు పడ్డ జనం... ఇసుక తుఫానుతో ఏకంగా నగరాలకు నగరాలనే కప్పేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వార్తలు