విమానం హైజాక్ కలకలం

20 Sep, 2016 16:56 IST|Sakshi
విమానం హైజాక్ కలకలం

మనీలా: సౌదీ అరేబియా విమానం హైజాక్ కు గురైందన్న సమాచారంతో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో కలకలం రేగింది. 300 మందితో జెడ్డా నుంచి మనీలాకు వచ్చిన ఎస్ వీ 872 విమానం నినోయ్ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో తెలియక విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చెందారు. విమానం హైజాక్ కు గురైందన్న సమాచారంతో పోలీసులు విమానాన్ని చుట్టుముట్టారు.

విమానానికి ముప్పు ఉందని ఎయిర్ పోర్టు కంట్రోల్ రూముకు పైలట్ సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాన్ని ప్రత్యేక స్థలంలో కిందకు దించారు. పైలట్ పొరపాటున ’పానిక్ బటన్’ నొక్కాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ రెండుసార్లు పానిక్ బటన్ నొక్కడంతో కలకలం రేగిందని ఎయిర్ పోర్ట్ జనరల్ మేనేజర్ ఎడ్మండ్ మోనేరల్ తెలిపారు. భద్రత చర్యల్లో భాగంగా విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని చెప్పారు. పైలట్ ను ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. ప్రయాణికుల్లో చాలా మంది హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు.

మరిన్ని వార్తలు