ఫేస్‌బుక్‌ సీఈవో అవ్వాలనుంది

27 May, 2018 14:39 IST|Sakshi
హిల్లరీ క్లింటన్‌ (పాత ఫొటో)

వాషింగ్టన్‌ : రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవాలని హిల్లరీ క్లింటన్‌ భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌మీడియా నెట్‌వర్కింగ్‌ కంపెనీ ఫేస్‌బుక్‌కు సీఈవో అవ్వాలనుకుంటున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. శుక్రవారం హార్వాడ్‌ విశ్వవిద్యాలయానికి రాడ్‌క్లిఫ్‌ మెడల్‌ను అందుకునేందుకు విచ్చేసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మసాచుసెట్స్‌కు చెందిన ఓ డెమొక్రాట్‌ మీరు ఏ కంపెనీకి సీఈవో కావాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఫేస్‌బుక్‌ లేదా సీనెట్‌లకు అని ఆమె తడుముకోకుండా చెప్పినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ నుంచి ప్రపంచంలో చాలామంది వార్తలు తెలుసుకుంటారని, అవి నిజమైనవా? లేక నకిలీవా? అన్న విషయాన్ని సైతం పట్టించుకోరని హిల్లరీ పేర్కొన్నారు.

కాగా, నకిలీ వార్తలు, కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణాలతో ఫేస్‌బుక్‌ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీ వీటి నుంచి బయటపడుతోంది.

మరిన్ని వార్తలు