కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

9 Apr, 2020 08:39 IST|Sakshi

లాస్‌ ఏంజిల్స్‌ : కరోనా మహమ్మారికి మరో సెలబ్రిటీ మృత్యువాతపడ్డారు. హాలీవుడ్‌‌ నటుడు అలెన్‌ గార్ఫిల్డ్‌(80) కరోనా సమస్యల కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే వెల్లడించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘అలెన్‌కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గొప్ప నటుడు, నాష్‌విల్లెలో నాకు భర్తగా నటించిన వ్యక్తి కరోనా వల్ల ఈ రోజు(మంగళవారం) మరణించారు. అతని కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అని ఫేస్‌బుక్‌లో రాశారు. (కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మృతి)

నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1968 లో వచ్చిన 69 చిత్రంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఇక అలెన్‌.. విలన్‌ ప్రాత్రల్లోనే అధికంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వూడీ అలెన్‌, విమ్‌ వెండర్స్‌ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన చివరిసారి 2016లో విడుదలైన చీఫ్‌ జాబులో కనిపించారు. ఈ సినిమా 1986లో రూపొందించారు.
(నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం? )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు