పాక్‌ను విడిచివెళ్తున్న తేనెటీగలు!

22 Jan, 2019 12:45 IST|Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌ ఉగ్రవాదుల కేంద్రంగా మారుతోందని భారత్‌తోసహా అగ్రరాజ్యాలు కూడా ఆరోపిస్తున్నాయి. ప్రపంచానికి ఉగ్రవాదులను సరఫరా చేస్తున్న దేశంగా కూడా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రకార్యాకలాపాలను విడనాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. ఇప్పుడిదంతా ఎందుకంటే.. పాక్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు తరచూ సైనిక ఆపరేషన్లు జరుగుతుంటాయి. దీంతో ఆ దేశం నిత్యం బాంబుల మోతతో మార్మోగిపోతుంది. ఈ తుపాకులు, బాంబుల మోతలు ఆ దేశంలో  మనుషులేకాదు.. కనీసం తేనెటీగలకు కూడా నిలువ నీడ లేకుండా చేస్తున్నాయట. 

తుపాకులు, బాంబుల మోతలు పెరగడంతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిందని, అందుకే తేనెటీగలు పాక్‌ను విడిచి వెళ్లిపోయాయని పాక్‌ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ఇప్పటికే రెండు జాతుల తేనెటీగలు తమ ప్రాంతంలో కనుమరుగయ్యాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు లేకపోతే ఏమవుతుంది? తేనె లేనంత మాత్రాన బతకలేరా.. అనే అనుమానం కలగొచ్చు. భూమిపై తేనేటీగలు అంతరించిన నాలుగు సంవత్సరాల్లో మనిషి అంతరిస్తాడని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. తేనెటీగలు కేవలం మకరందం కోసమే కాదని.. పుష్పాలు ఫలదీరకణం చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. తేనెటీగలు లేకపోతే పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తల ఆందోళన చెందుతున్నారు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చైనాలో భారీ పేలుడు.. 44 మంది మృతి

ఫేస్‌బుక్‌లో బయటపడ్డ మరో భద్రతాలోపం

ఇరాక్‌లో 71 మంది జలసమాధి

స్కూల్‌ బస్సు హైజాక్‌.. ఆపై నిప్పు

న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం

మళ్లీ భారత్‌పై దాడి జరిగితే..

గుర్తుపట్టకుండా ప్లాస్టిక్‌ సర్జరీ!

‘పెట్రోలియం’కు జీవ ఇంధనమే  సరైన ప్రత్యామ్నాయం

యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్‌ 

24 గంటల్లో థాయ్‌ల్యాండ్‌ వీసా..!

‘పుల్వామా అమరులు ఇప్పుడు సంతోషిస్తారు’

పాకిస్తాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

న్యూజిలాండ్‌ సంచలన నిర్ణయం

గూగుల్‌కు భారీ జరిమానా

అమ్మాయిలను పార్టీకి పిలిచాడని..

బ్రెగ్జిట్‌కు జూన్‌ 30 దాకా గడువివ్వండి

సంతోషంలో వెనకబడ్డాం

లండన్‌ జైల్లో నీరవ్‌ మోదీ

చూస్తున్నారుగా.. అందరికీ ఇదే శిక్ష పడుతుంది!

నీరవ్‌ మోదీ అరెస్ట్‌

ఫొటోలకు ఫోజులు... భయానక అనుభవం!

‘ఆమె ఇక రాదు.. నువ్వు ఇంటికి వెళ్లు’

విమానం ల్యాండ్‌ అవుతుండగా చెలరేగిన మంటలు

3 వేల కి.మీ. నుంచే సర్జరీ

అధ్యక్షుడికీ తప్పని.. ఓట్లపాట్లు

‘అతని పేరును ఎవరూ పలకరాదు’

తాలిబన్ల చెరలో 58 మంది సైనికులు

నీరవ్‌ మోదీపై అరెస్ట్‌ వారెంట్‌

ట్రామ్‌రైలులో కాల్పులు

కాల్పుల కలకలం.. ఉగ్రదాడిగా అనుమానం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..

శాండల్‌వుడ్ సీనియర్‌ నటి కన్నుమూత

ముచ్చటగా మూడోసారి..