మరో రెండు వారాల్లో ఆ దేశం కరోనా ఫ్రీ!

21 Apr, 2020 13:29 IST|Sakshi

హాంకాంగ్ : మహమ్మారి కరోనా అన్ని దేశాలనూ చుట్టేసింది. అయితే, నిత్యం వేలాది కేసులు నమోదవుతున్న చైనా పొరుగు దేశం హాంకాంగ్‌ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. హాంకాంగ్‌లో సోమ‌వారం ఒక్క కోవిడ్-19 కేసు కూడా న‌మోదు కాలేదు. ఈ విష‌యాన్ని ఆ దేశ వైద్యారోగ్య శాఖ మంగళవారం అధికారికంగా ప్ర‌క‌టించింది. మార్చి 23న అక్కడ తొలి క‌రోనా కేసు న‌మోదైంది. కోవిడ్‌ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనాకు అతి స‌మీపంలో ఉన్న హాంకాంగ్ భారీగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌ధానంగా అమెరికా, లండ‌న్ ఇత‌ర యూరప్‌ దేశాల నుంచి వ‌చ్చే ఎయిర్‌లైన్స్ సేవ‌ల‌ను ర‌ద్దు చేసింది. లాక్‌డౌన్ పాటించ‌కున్నా.. ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేలా క‌ఠిన నిబంధ‌న‌లు అమలు చేసింది. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వానికి స‌హ‌కరించారు. ఫ‌లితంగా ఆ దేశంలో కేసులు, మ‌ర‌ణాలు సంఖ్య త‌క్కువ‌గా న‌మోదైంది. 
(చదవండి: కరోనా: ‘వారి పరిస్థితి మరింత దారుణం’)

కొత్త కేసులు నమోదు కాకపోతే..
ఇప్పటివరకు హాంకాంగ్‌లో 1,026 మంది కోవిడ్‌ బారినపడగా.. వారిలో  630 మంది కోలుకున్నారు. నలుగురు మరణించారు. ప్రస్తుతం 392 యాక్టివ్‌ కేసులున్నాయి. మ‌రో రెండు వారాల్లో కొత్త కేసులు న‌మోదు కాక‌పోతే హాంకాంగ్ క‌రోనా ఫ్రీగా మారుతుంది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యమేంటంటే ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌న‌సాంద్ర‌త ఉన్న దేశాల్లో హాంకాంగ్ ఒక‌టి. గ‌త సార్స్  అనుభ‌వాలు నేర్పిన పాఠాల‌నుంచి హాంకాంగ్ త్వ‌ర‌గానే మేలుకుంది. లాక్‌డౌన్ విధించక‌పోయినా ప్రజలు స్వీయ నియంత్రణలో ఉన్నారు. 
(చదవండి: లాక్‌డౌన్‌ ఎత్తివేయడం ప్రమాదకరం!)

>
మరిన్ని వార్తలు