జాతకం చెప్పే మూషికాలు!

9 Aug, 2014 00:38 IST|Sakshi
జాతకం చెప్పే మూషికాలు!

రామచిలుకలే కాదు.. ఎలుకలు కూడా జాతకం చెబుతాయి తెలుసా!? అయితే, అవి మన ఎలుకలు కావులేండి. ఆస్ట్రేలియా ఎలుకలు! అయితే  ఇప్పుడు వాటితో జాతకం చెప్పించుకోవాలంటే అక్కడిదాకా వెళ్లాలా? అని కదా మీ ప్రశ్న. అక్కర్లేదు.. చెన్నై సమీపంలోని నాగపట్నం జిల్లా శీర్కాళికి దాకా వెళ్తేచాలు. అక్కడ వినోద్ అనే వ్యక్తి వీటిని పెంచుతున్నాడు. పలు రంగుల్లో ఉండే ఈ ఆస్ట్రేలియా మూషికాలు కుందేళ్లలా కనువిందు చేస్తాయి.

ఇలా ముచ్చటపడే వినోద్ ఓ జంట ఎలుకలను కొనుక్కుని మరీ కంగారూల దేశం నుంచి తెచ్చి పెంచుతున్నాడు. ప్రస్తుతం ఈ రెండు ఎలుకలు తమ సంతానాన్ని 50 దాకా పెంచాయి. కిళిపో జాతికి చెందిన వీటిని చూసేందుకు స్థానికంగా జనం తండోపతండాలుగా తన ఇంటికి వస్తున్నారని చెబుతున్నాడు వినోద్. వచ్చిన వారిలో వీటిని కొనుక్నునే వాళ్లూ ఉన్నారన్నాడు. మీరు కూడా చూడ్డమే కాదు కొనుక్కుంటారా? అయితే జంట ఎలుకలు.. జస్ట్ ఆరొందల యాభై రూపాయలే. ట్రై చేయండి.             
- సాక్షి, చెన్నై
 

మరిన్ని వార్తలు