నమో థాలి, నమో మిఠాయి థాలి!

23 Sep, 2019 03:53 IST|Sakshi

హ్యూస్టన్‌: హ్యూస్టన్‌ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ కోసం ‘నమో థాలి, నమో మిఠాయి థాలి’లతో విందు భోజనం ఎదురుచూస్తోంది. హ్యూస్టన్‌లో కిరణ్స్‌ అనే రెస్టారెంట్‌ నడుపుతున్న ఒడిశాకు చెందిన చెఫ్‌ కిరణ్‌ వర్మకు హ్యూస్టన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీకి భోజనం అందించే అవకాశం లభించింది. మోదీకే కాకుండా, హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరవుతున్న భారతీయులకు భారతీయ వంటకాలను బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను ఆమే అందించనున్నారు. ఈ అవకాశం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘గత 25 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. మాది ఒడిశా. ప్రధాని మోదీకి భోజనం సమకూర్చే అవకాశం రావడం గొప్పగా ఉంది.

ఆయన కోసం ప్రత్యేకంగా నమో థాలి, నమో మిష్టి/మిఠాయి థాలిలను రూపొందించాం. ఈ డిషెస్‌ కోసం ఎంతో రీసెర్చ్‌ చేశాను. ఇటీవలి ఆయన పుట్టిన రోజు కోసం వారి అమ్మగారు ఏ వంటలు చేశారో కనుక్కున్నాను. నమో థాలిలో మేథీ తెప్లా, పుదీనా చట్నీతో సమోసా, చింతపండు చట్నీతో కచోరి, పప్పు, కిచిడీ, ఖాండ్వి.. సహా పలు ఇతర వంటకాలు ఉంటాయి. మిఠాయి థాలిలో గాజర్‌ హల్వా, రస్‌మలాయి, శ్రీఖండ్, గులాబ్‌ జామూన్, పాయసం.. సహా మరికొన్ని స్వీట్లు ఉంటాయి. వీటిలో ఏ వంటకాలను మోదీ ఆస్వాదించారో ఆయన విందు ఆరగించిన తరువాతే చెప్తాను. ఈ రెండు డిషెస్‌ను మా రెస్టారెంట్లో రెగ్యులర్‌ డిషెస్‌గా అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం’అని వివరించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మిన్నంటిన కోలాహలం

సరిహద్దు భద్రతే కీలకం

అబ్‌ కీ బార్‌ .. ట్రంప్‌ సర్కార్‌!

భారత్‌కు ట్రంప్‌ నిజమైన ఫ్రెండ్‌

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 

ఈనాటి ముఖ్యాంశాలు

ఫాస్ట్‌పుడ్‌ తింటున్నారా.. జర జాగ్రత్త!

హ్యూస్టన్‌లో అరుదైన దృశ్యాలు

మోదీని కలిసిన కశ్మీరీ పండిట్లు

మోదీ మెనూలో వంటకాలివే..

హ్యూస్టన్‌లో నేడే హౌడీ మోదీ

గల్ఫ్‌కి మరిన్ని అమెరికా బలగాలు

భారత పర్యావరణ కృషి భేష్‌

విద్యతోపాటే వర్క్‌ పర్మిట్‌

డాలర్‌ సిరి.. హెచ్‌ 1బీ వీసా ఉంది మరి

భారత్‌పై ప్రశంసలు కురిపించిన ఐరాస

పాముతో పెట్టుకుంటే అంతే మరీ..

ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చిన యాపిల్‌ సీఈవో

మగాళ్లు షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడరు..

46 పాక్‌ విమానాలు ఖాళీగా తిరిగాయి

2020లో అదే రిపీట్‌ అవుతుంది!

వేలాది ఫేక్‌ న్యూస్‌ అకౌంట్ల క్లోజ్‌

ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు

పిల్లల్ని కనే ప్రసక్తే లేదు..

ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావన!

హౌడీ మోదీకి వర్షం ముప్పు?

87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..

‘ఫేస్‌బుక్‌’ ఉద్యోగి ఆత్మహత్య

‘నా జీవితమే విషాదంలా మిగిలిపోయింది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌