ఆ రెండు ఉంటే మంచిదట!

12 Mar, 2016 15:17 IST|Sakshi
ఆ రెండు ఉంటే మంచిదట!

బ్రౌన్ ఫ్యాట్ మంచిదే!:
ప్రత్యేక రకమైన కొవ్వు అయిన బ్రౌన్ ఫ్యాట్ మనకు మంచే చేస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది శరీరంలోని కేలరీలను కరిగించి వేడిని పుట్టిస్తుందని, పెద్దల్లో బ్లడ్ షుగర్‌లో నిలకడకు వీలుందట.
 

ప్రేమ హార్మోన్!:
పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడే పురుషులకు సరైన మోతాదులో ఆక్సిటోసిన్‌ను ఇస్తే అది ప్రేమ హార్మోన్‌లా పనిచేస్తుందని, ఒత్తిడితగ్గి భాగస్వామిపై మక్కువను పెంచుకుంటారని తాజా అధ్యయనంలో కనుగొన్నారు.

రెండో సంతానం లేకపోతే..:
రెండో సంతానం కావాలనుకునేవారు.. ఇంట్లో మొదటి సంతానానికి ఊబకాయం రాకుండా ఉండాలంటే వారికి 2-4ఏళ్లు వచ్చేలోగా ఇంకొకరిని కనాలట. మొదటి సంతానం ఆహార అలవాట్లలో మార్పు రావడం ఒకటి కాగా రెండో సంతానం జన్మించడం వల్ల అతనితో ఆటలాడుకుంటూ గడపడం వల్ల కూడా ఊబకాయంరాదని మిచిగాన్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
 
ఆదాయం పెరిగితే ఆనందమేనా?:
ఆదాయం పెరిగినా కొందరి జీవితంలో ఆనంద ఉండదని పరిశోధకులు కనుగొన్నారు.  18 వేల మందిపై తొమ్మిదేళ్లపాటు ఆదాయ మార్పులు, జీవితంలో తృప్తి అనే అంశంపై సుదీర్ఘంగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. వరుసగా ఆదాయం పెరగడమనేది తమకు అంత ముఖ్య విషయం కాదని, దాంతో గొప్ప సంతోషమేం లేదన్నట్లు చాలామంది చెప్పారు.
 
సీసంతో స్థూలకాయం:

జీవితంలో తొలి దశంలో సీసానికి ప్రభావితం కావడం వల్ల స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా అధ్యయనం కనుగొంది. ఇది గట్ మైక్రోబయోటాపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెప్పారు.
 
నడకతో అల్జీమర్స్‌కు చెక్:
నడక, ఈత, తోటపని, డ్యాన్సింగ్ చేస్తూ చురుగ్గా ఉండే పెద్ద వయస్సు వారికి అల్జీమర్స్ సోకే ముప్పు తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.  మెదడులో గ్రేమ్యాటర్ ప్రభావం ఎక్కువై జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఆతురతతో ఉంటే:
ఆతరుతతో ఉండే వారు ప్రపంచాన్ని విభిన్నంగా అర్థం చేసుకుంటారని తాజా అధ్యయనంలో తేలింది. అలాంటివారు సాధారణ వ్యక్తులతో పోలిస్తే సురక్షిత, ప్రమాద పరిస్థితులను సరిగా గుర్తించలేదు.

మరిన్ని వార్తలు