ఆ టెక్‌ కంపెనీ ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

13 Nov, 2019 08:56 IST|Sakshi

బీజింగ్‌: చైనా టెలికాం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ కంపెనీ ఉద్యోగులు భారీ ఆఫర్‌ ప్రకటించింది. అమెరికా హువావే కంపెనీల ఉత్పత్తులు, చైనా వాణిజ్య బ్లాక్‌లిస్టింగ్‌ను దీటుగా ఎదుర్కొనేలా సహాయపడిన సిబ్బందికి 2 బిలియన్ యువాన్ల (286 మిలియన్ డాలర్లు) నగదు రివార్డులను అందజేస్తామని మంగళవారం తెలిపింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(పరిశోధన, అభివృద్ధి) టీమ్‌లకు  ఈ నగదు బహుమతులను అందించనుంది. 

ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం పరికరాల ప్రొవైడర్, అమెరికాలో హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మే నెలలో అమెరికన్ సంస్థలతో వ్యాపారం చేయకుండా నిషేధించిన  అనంతరం  చైనా కంపెనీ  ఉద్యోగులకు ఈ నగదు  బోనస్‌లను ఇచ్చేందుకనిర్ణయించింది.  యుఎస్ ఒత్తిడి నేపథ్యంలో ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపుగా ఇది వుంటుందని  హువావే మానవ వనరుల విభాగం  కంపెనీ సిబ్బందికి ఇచ్చిన నోటీసులో తెలిపింది.  తద్వారా దాదాపు 1,90,000 మంది కార్మికులకు ఈ నెలలో ఇది రెట్టింపు వేతనం ఇస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

కాగా అమెరికా  నిషేధం విధించడంతో ప్రత్నామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది  కంపెనీకి చెందిన 5జీ నెట్‌వర్కింగ్‌కు సంబంధించి పరికరాలు భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని ఆరోపిస్తూ  డొనాల్డ్‌ ట్రంప్‌ హువావే ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు