చైనాలో కనువిందుచేసే ఆకాశమార్గం

28 Sep, 2017 19:35 IST|Sakshi

బీజింగ్‌ : ప్రపంచంలో అద్భుత కట్టడాలు, వంతెనలు నిర్మించడంలో చైనాను మించిన దేశం మరోటి లేదు. ఈ విషయంలో ఆకాశపు హద్దులను కూడా చెరిపేస్తూ విను వీధుల్లోకి దూసుకెళుతోంది. సెంట్రల్‌ చైనాలోని హునన్‌ రాష్ట్రంలో రెండు పర్వతాలను కలుపుతూ ప్రపంచంలోనే అతి పొడవైన, అతి ఎల్తైనా స్టీల్‌ సస్పెన్షన్‌ రోడ్డు వంతెనను నిర్మించింది. 3, 858 అడుగులు పొడవు, 1,102 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ వంతెన ‘గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోకి కూడా ఎక్కింది. ఈ వంతెన నిర్మాణానికి 1700 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు చైనా ప్రభుత్వం తెలియజేసింది.

హునన్‌లో అత్యధికంగా పర్వతాలు ఉండడంతో ట్రాఫిక్‌ మందగమనంతో నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి వంతెనలను నిర్మించాల్సి వస్తోందని చైనా వెల్లడించింది. ఈ వంతెన మీది నుంచి బాటసారులు వెళ్లేందుకు కూడా మార్గం ఏర్పాటు చేశారు. పచ్చటి చెట్లతో కనువిందుచేసే అందమైన డెహాంగ్‌ క్యాన్‌హాన్‌ లోయను తిలకిస్తూ వంతెన మీదుగా వెళ్లవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం వంతెనపై 1888 విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. 2007లో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం ఇటీవల పూర్తయింది.

మరిన్ని వార్తలు