విరాళాలతో కరోనాను తరిమి కొడుతున్న దాతలు

13 Apr, 2020 20:02 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి కరాళ నత్యం చేస్తున్న కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులతోపాటు, పొట్ట కూటి కోసం అలమటిస్తున్న అభాగ్యులను, అనాథలను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా దయార్ద్ర హదయులైన దాతలు ముందుకు వచ్చారు. వారిలో కార్పొరేట్‌ కుటుంబ సంస్థలు, కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు, పార్లమెంట్లు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు వ్యక్తులు ఉన్నారు. వారంతా మున్నెన్నడులేని విధంగా ముందుకు వచ్చారు. (కరోనాపై పోరుకు అమ్మ రూ.13 కోట్ల విరాళం )

ఇలా మార్చి ఒకటవ తేదీ నాటికే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్‌ డాలర్లు, అంటే దాదాపు 7,629 కోట్ల రూపాయలు విలాసంగా వసూలయ్యాయి. ఇదివరకు ఎబోలా వైరస్‌ దాడి చేసినప్పుడు 362 మిలియన్‌ డాలర్లు, హార్వే ఉప్పెన ముంచుకొచ్చినప్పుడు 341 మిలియన్‌ డాలర్లు మాత్రమే విరాళంగా వచ్చాయి. ఈసారి పెద్ద మొత్తాల్లో విరాళాలు కుటుంబ సభ్యులతో నడుస్తున్న వ్యాపార సంస్థల నుంచి రావడం, ఆ సంస్థలే ముందుగా స్పందించడం గమనార్హం. ఈ సంస్థలకు కుటుంబ సభ్యులే సీఈవోలుగా, డైరెక్టర్లుగా ఉంటారు కనుక వారు త్వరగా సమావేశం కాగలరు, వారి మధ్య త్వరగా ఏకాభిప్రాయం కుదురగలదు. అదే పలువురు కలిసి నడిపే కార్పొరేట్‌ సంస్థల్లో డైరెక్టర్లు సకాలంలో సమావేశం అవడం, అయినా ఏకాభిప్రాయానికి రావడం అంత సులువు కాదు.  (విడాకులు తీసుకున్న సీరియ‌ల్ న‌టి )            

ఇటలీలో ఆగ్నెల్లీ కుటుంబం
► ఇటలీలో ప్రధానంగా కార్ల పరిశ్రమను నిర్వహించే ఆగ్నెల్లీ పారిశ్రామిక కుటుంబం పది మిలియన్‌ యూరోలను ఇటలీ పౌర రక్షణ విభాగానికి విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా ఆ కుటుంబానికి చెందిన కంపెనీలు వైద్య పరికరాలను, మందులను, ఆహారాన్ని స్వయంగా కొనుగోలు చేసి ప్రభుత్వ విభాగాలకు, ప్రజలకు సరఫరా చేసింది. సామాజిక దూరం ఎలా పాటించాలో అవగాహన కల్సించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. (
ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస)

►విలాస వస్తువులను తయారు చేసే ఫ్రాన్స్‌కు చెందిన ఎల్వీఎంహెచ్‌ సంస్థ ప్రభుత్వ వైద్య సిబ్బందికి నాలుగు కోట్ల క్లినికల్‌ మాస్క్‌లను విరాళంగా అందజేసింది. తమకు చెందిన మూడు కాస్మోటిక్‌ ఫ్యాక్టరీలను కేవలం శానిటైజర్లను తయారు చేయడానికే కేటాయించింది. వాటన్నింటిని ఉచితంగా అందచేయడానికి ముందుకు వచ్చింది.  
►ఆరోగ్య రంగంలో ప్రసిద్ధి చెందిన స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘రోచే’ సంస్థ కరోనా వైరస్‌ను కనుగొనేందుకు కొత్త పరీక్షను రూపొందించింది. ఇక భారత్‌కు చెందిన టాటా సన్స్‌ అండ్‌ టాటా ట్రస్ట్స్‌ 1500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అదనంగా రోగులకు అవసరమైన వెంటిలేటర్లు అందజేయడానికి టాటా ట్రస్టులు ముందుకు వచ్చాయి.

►విప్రో గ్రూప్‌ ఈజ్మీ ప్రేమ్‌జీ గ్రూప్‌ 1125 కోట్ల రూపాయలు, అంబానీలకు చెందిన రిలయెన్స్‌ ఇండస్ట్రీ 500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది. లాభాలే లక్ష్యంగా పనిచేసే వ్యాపార సంస్థలు ఇలాంటి ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యమే.
►ఇటలీకి చెందిన జార్జియో అర్మానీ, రెమో రుఫిణి, సిల్వియో బెర్లూస్కోని అనే బిలియనీర్‌ వ్యాపారస్థులు వారి దేశంలో కరోనాపై పోరాటానికి 45 మిలయన్‌ డాలర్లును విరాళంగా ప్రకటించారు.

► ఇక క్రీడారంగంలో ఆటల పోటీలు నిలిచిపోవడం వల్ల ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోయిన ఉద్యోగుల జీతాలను చెల్లిస్తామని జియాన్‌ విలియమ్‌సన్, బ్లేక్‌ గ్రిఫిన్‌ లాంటి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారులు ముందుకు వచ్చారు. అథ్లెట్స్, క్రికెట్‌ క్రీడాకారులు కూడా తమవంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
►కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పది కోట్ల డాలర్లను ప్రపంచ దిగ్గజ వ్యాపారస్థుల్లో ఒకరైన బిల్‌ గేట్స్‌ ప్రకటించారు.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అభివద్ధి కోసం చైనా ధనవంతుడు జాక్‌ మా వంద మిలియన్‌ యాన్లను కేటాయించారు. కరోనా పరీక్షలకు ఐదు లక్షల కిట్లను, పది లక్షల మాస్క్‌లను అమెరికాకు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. (‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’ )

మరిన్ని వార్తలు