మక్కాలో భారీ హోటల్

22 May, 2015 02:11 IST|Sakshi
మక్కాలో భారీ హోటల్

హైదరాబాద్: ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో నిర్మించనున్న భారీ హోటల్ ఇది. ఒక్కో టవర్‌లో 44 అంతస్తుల చొప్పున 12 టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 10 వేల గదులు, 70 రెస్టారెంట్లు, అరడజను హెలీప్యాడ్లు ఉండే ‘ది అబ్రాజ్ కుదాయ్’ అనే ఈ హోటల్ ప్రపంచంలోనే అతిపెద్దది కానుంది. 46 లక్షల చదరపు అడుగుల మొత్తం విస్తీర్ణంలో...14 లక్షల చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

10 టవర్లలో ఫోర్ స్టార్ సౌకర్యాలు, రెండు టవర్లలో ఫైవ్ స్టార్ వసతులు ఉంటాయి. ఇప్పటికే పనులు ప్రారంభమైన ఈ హోటల్‌ను 2017లోగా పూర్తిచేయాలని యోచిస్తున్నారు. అన్నట్టు.. ఈ హోటల్ నిర్మాణానికయ్యే మొత్తం ఎంతో తెలుసా? 225 కోట్ల పౌండ్లు. మన రూపాయల్లో చెప్పాలంటే.. దాదాపు 22,400 కోట్లు..!

మరిన్ని వార్తలు