ఊహించిన దానికన్నా 10వేల ఏళ్ల ముందుగానే!

3 Nov, 2016 10:18 IST|Sakshi
ఊహించిన దానికన్నా 10వేల ఏళ్ల ముందుగానే!

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు 550 కిలోమీటర్ల ఉత్తరదిశలోని ఫ్లిండర్స్ పర్వతాల్లో ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో.. అక్కడ ఇంతకుముందు ఊహించినదానికన్నా 10 వేల సంవత్సరాల ముందే మానవుల ఉనికి ఉందని గుర్తించారు. ఆదిమ మానవులకు సంబంధించిన వందలాది రాళ్లతో తయారుచేసిన కళాఖండాలు, ఎముకలకు సంబంధించిన ఆనవాళ్లు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇంతకుముందు ఆస్ట్రేలియా తూర్పుతీరంలోని న్యూ సౌత్‌వేల్స్‌కు 50,000 సంవత్సరాల క్రితం మానవులు చేరుకున్నారని, వారు అక్కడనుంచి మధ్య ఆస్ట్రేలియా ప్రాంతానికి చేరుకోవడానికి 11,000 సంవత్సరాలు పట్టిందని పరిశోధకులు భావించేవారు. అయితే.. తాజాగా దొరికిన పురాతన అవశేషాలు.. మధ్య ఆస్ట్రేలియాలో ముందుగానే మానవుడి ఉనికిని తెలుపుతున్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వార్తలు