'వారు నేర్చుకోవడం లేదా.. అయితే నవ్వించండి'

8 Sep, 2015 13:44 IST|Sakshi
'వారు నేర్చుకోవడం లేదా.. అయితే నవ్వించండి'

లండన్: మీ చిన్నారులు ఏ కొత్త విషయాలు చెప్పినా అస్సలు నేర్చుకోవడం లేదని.. అలవాటు చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? వారికి పదే పదే అదే అంశాన్ని నేర్పించేందుకు ప్రాయసపడుతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి అలా చేయడానికి బదులు వారిని ఓసారి నవ్వించే ప్రయత్నం చేయండని చెబుతున్నారు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు. అలా నవ్వించడం ద్వారా వారు ఎలాంటి విషయాలు చెప్పినా ఇట్టే నేర్చుకొని అలవాటుపడిపోతారని వారు స్పష్టం చేస్తున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం చెప్పేదిశగా ఏడాదిన్నర చిన్నారులను ప్రయోగానికి తీసుకున్న శాస్త్రవేత్తలు వారికి తలా ఓ బొమ్మ చేతికి ఇచ్చారు. అందులో కొందరు పిల్లలు ఆ బొమ్మతో ఆడుకోగా మరికొందరు మాత్రం తీసుకున్న వెంటనే నేలకేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇది చూసి మరో గ్రూపులో ఆడుకుంటున్న పిల్లలు నవ్వుకుంటూ తిరిగి తమ ఆటను కొనసాగించారు. దీని ప్రకారం నవ్వడం ద్వారా పిల్లలు రెట్టింపు ప్రశాంతతను పొంది ఏ అంశాన్నైనా తమలో ఇముడ్చుకునేందుకు కావాల్సిన శక్తిని పొందగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వార్తలు