వందల జంటలు చుంబనాలు...

15 Aug, 2015 11:43 IST|Sakshi
వందల జంటలు చుంబనాలు...

న్యూయార్క్:    డెబ్బై యేళ్లనాటి  అనుభవాలను, విజయాలను తలచుకుంటూ వందలాది జంటలు న్యూయార్క్లోని టైమ్  స్క్వేర్ దగ్గర గుమిగూడాయి. తమ సంతోషాన్ని, సంబరానికి గుర్తుగా  సంబరాలు  చేసుకున్నారు.  రెండవ ప్రపంచ యుద్ధంలో  జపాన్  తోక ముడిచిన సంరంబాన్ని తలచుకుంటూ ఒకర్నొకరు  కౌగిలించుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు. జపాన్ పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ సంబరాలను శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు.  నావికుల దుస్తుల్లో పురుషులు, తెల్లని వస్త్రాల్లో మహిళలు  అలనాటి నావికుల విజయ ప్రతీకలుగా  ఫోజులిచ్చారు.  

జపాన్పై  విజయం సాధించామంటూ ఫోటో జర్నలిస్టు అల్ఫ్రెడ్ తీసిన 'వి-జె డే ఇన్ టైమ్స్ స్వ్కేర్ '  ప్రసిద్ధి పొందింది.  ఆ ఫోటోను  గుర్తుకు  తెచ్చుకుంటూ పలువురు  ఫోటోలకు ఫోజులిచ్చారు.  అమెరికా  నావికుడు, తెల్లని దుస్తుల్లో ఉన్న మహిళలను ముద్దాడుతూ ఉన్న ఫోటో అది. ఆనాటి యుద్ధంలో పాల్గొన్న  రే అండ్ ఇల్లీ దంపతులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.  అలనాటి  అనుభవాలను తలచుకుని ఉద్విగ్నభరితంగా మారిపోయారు.  వీరి పెళ్లిరోజు కూడా శుక్రవారమే.

ప్రపంచ దేశాలను వణికించిన రెండవ ప్రపంచ యుద్ధం  1945 సంవత్సరం ఆగస్టు14న ముగిసింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియెట్ యూనియన్... జపాన్తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకీ లపై అణుబాంబులను ప్రయోగించటంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది.

మరిన్ని వార్తలు