తవ్వకాల్లో భారీ బంగారు నాణేలు

11 Sep, 2018 09:53 IST|Sakshi

ఉత్తర ఇటలీలోని ఓ పాత థియేటర్‌ తవ్వకాల్లో బంగారు నాణేల నిధిని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతత్వ శాస్త్రవేత్తల అధ్యయనంలో నేలమాళిగలో భద్రపర్చిన వందల కొద్దీ నాణేలను వారు కొనుగొన్నారు.  మిలియన్‌ డాలర్ల విలువైన రోమన్ బంగారు నాణేలు కనిపించడం విశేషం. ఇటలీలోని ఓ ప్రాంతంలో పునాది పనులు చేస్తుండగా వందల సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు లభించినట్లు ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.

స్విట్జర్లాండ్ సరిహద్దులో ఉత్తర ఇటలీలోని  కోమోలోని కాస్సోనీ థియేటర్ బేస్‌మెంట్‌ తవ్వకాల్లో 4, 5 వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య కాలంనాటి 300 నాణేలను తవ్వి తీసామని అధ్యయన వేత్తలు తెలిపారు. క్వింగ్ రాజవంశానికి చెందిన రాతి కూజాలో బంగారు పట్టీతోపాటు, 19 మిలియన్‌డార్ల విలువైన నాణేలుణ్నాయని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యత వివరాలు సంపూర్ణంగా తెలియనప్పటికీ, పురాతత్వ శాస్త్రానికి నిజమైన నిధిని గుర్తించామని సంస్కృతి మంత్రి అల్బెర్టో బోన్సిసోలీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మంత్రిత్వ శాఖ  ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. మిలన్‌లోని మిబాక్ రిస్టోరేషన్ ప్రయోగశాలకు బదిలీచేసామని వీటి చారిత్రక ప్రాముఖ్యత తెలుసుకోవాల్సి వుందన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు, పునరుద్ధరణకర్తలు వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. వీటిని విలువను అధికారులు స్పష్టం చేయనప్పటికీ, మిలియ న్‌డాలర్ల  విలువ వుంటుందని అంచనా. 

ఏదో ప్రమాద సమయంలో వీటిని దాచిపెట్టి వుంటారని నాణేల నిపుణులు మారియా గ్రాజియా ఫెచీనిటి తెలిపారు. ఈ నాణేలపై 474 ఏడీ నాటి చక్రవర్తులు హోనోరియాస్, వాలెంటినియమ్ III, లియోన్ I, ఆంటోనియో,  లిబియో సెవెరోల గురించి రాసివున్నట్టు ఆమె తెలిపారు.  ప్రస్తుతం  బ్యాంకులలో  అమర్చేవిధంగానే వీటిని పొందుపర్చినట్టు  చెప్పారు. అలాగే ఇది వ్యక్తిగత సంపద కాకపోవచ్చు అని,  పబ్లిక్ బ్యాంకువి లేదా డిపాజిట్లు కావచ్చు అని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు