ఆకాశంలో వింత: ప్రజల్లో భయభ్రాంతులు

16 Jan, 2019 18:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రెజిల్‌ దేశంలోని మినాస్‌ గెరేయిస్‌ పట్టణంలోని ప్రజలు ఇటీవల ఓ వింతను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. కాస్త మబ్బు పట్టిన ఆకాశంలో పదులు, వందలు, వేలల్లో సాలె పురుగులు తేలియాడుతున్న దశ్యాన్ని చూసి ముందుగా అబ్బురపడ్డారు. ఆ తర్వాత అవి వర్షంలా ఆకాశం నుంచి కురుస్తున్నట్లు భ్రమపడి భయభ్రాంతులకు గురయ్యారు. ‘సావో పావులోకు ఈశాన్యంలో ఉన్న మా తాతగారి పొలానికి వెళుతుండగా, ఆకాశంలో నల్లటి మచ్చలు కనిపించాయి. ఇదేమిటంటూ కొంత ఎగువ ప్రాంతానికి Ðð ళ్లి చూడగా, అవన్నీ గాలిలో వేలాడుతున్న సాలె పురుగులని తెల్సింది. సాలె పురుగులు గాలిలో వేలాడడం ఏమిటనుకొని భయపడ్డాను’ అని ఆ దశ్యాన్ని చిన్న వీడియోగా తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసిన గెరేయిస్‌ పట్టణ వాసి ఒకరు వ్యాఖ్యానించారు.

ఈ వింత గురించి ఫెడరల్‌ యూనివర్శిటీలోని అరక్నాలోజి ప్రొఫెసర్‌ అడల్‌బెర్టో డాస్‌ సాంటోస్‌ను ప్రశ్నించగా, ఆ సాలె పురుగులను ‘పరవిక్సియా బిస్ట్రియాట’ అనే చాలా అరుదైన జాతికి చెందినవని, అవి భూమిలోని వేడి, గాలిలోని తేమను తట్టుకోలేనప్పుడు కొన్ని గుంపులుగా రెండు చెట్ల మధ్య లేదా కొన్ని ఎల్తైన చెట్ల మధ్య గూళ్లను అల్లుతుందని, ఆ గూళ్లు మనిషి కంటికి కనిపించనంత సన్నగా ఉంటాయని, ఆ గూళ్లను అల్లుతూనో, వాటికి వేలాడుతూనో సాలె పురుగులు కనిపిస్తాయని చెప్పారు. కొన్ని సమయాల్లో గాలీ గట్టిగా వీచినప్పుడు చెట్ల అంచుల నుంచి గూడు తెగిపోయి గాల్లో కొంత దూరం ప్రయాణిస్తాయని చెప్పారు. ఆ తర్వాత ఏ చెట్టు మీదనో, నెల మీదనో బారీ సాలె గూడు, సాలె పురుగులతోపాటు పడిపోతుంది. ఈ సాలె గూడుతోగానీ, సాలె పురుగులతోగాని మానవులకు ఎలాంటి ముప్పు ఉండదని అవన్ని భారీ గూడు వల్ల దోమలు, ఇతర క్రిమీకీటకాలు రాకుండా సాలె గూడు అడ్డుపడుతుందని ప్రొఫెసర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు