ఆ 'అరుదైన' మహిళ కోసం వేట..

2 Jun, 2015 09:38 IST|Sakshi
అజ్క్షాత మహిళ వదిలివెళ్లిన ఫస్ట్ జనరేషన్ ఆపిల్ డెస్క్ టాప్ ఇదే

అది శాన్ఫ్రాన్సిస్కోలోని దక్షిణ తీరప్రాంతం. ముద్దుగా 'సిలికాన్ వ్యాలీ' అని పిలుస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద హైటెక్ కార్పొరేషన్లన్నింటికీ కేంద్రం. అక్కడే ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఒకాయన కొన్నేళ్లకిందట చనిపోరు. ఇటీవలే ఆయనకు సంబంధించిన కొన్ని పాత వస్తువులను క్లీన్ బే ఏరియా ఈ-వేస్టేజి రీసైక్లింగ్ సెంటర్కు తీసుకెళ్లింది అతని భార్య.

కారణాలు ఏవైతేనేం.. ట్యాక్స్ రిసిట్ గానీ, కాంటాక్ట్ నంబర్ గానీ ఇవ్వకుండా వెళ్లిపోయింది. అలా ఆమె వదిలేసి వెళ్లిపోయన వాటిల్లో ఓ పాత సూట్కేస్ కూడా ఉంది. కొద్దిరోజుల తర్వాత క్లీన్ బే సిబ్బంది ఆ పెట్టెను తెరిచిచూశారు.
అదొక ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్! ఇంకా లోతుగా వెళితే..  ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్లీవ్ వోజ్నియాక్, రాన్ వాయెన్ స్వహస్తాల్లో అసెంబుల్ అయిన డెస్క్టాప్ అది. ప్రపంచంలో తయారైన తొలి 200 ఫస్ట్ జనరేషన్ ఆపిల్ కంప్యూటర్లలో ఒకటి!


అంతటి అరుదైన వస్తువును వదిలేసి వెళ్లిన ఆ మహిళ ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు క్లీన్ బే కంపెనీవారు. మళ్లీ ఆమె అవసరం ఎందుకొచ్చిందటే.. ఈ- వేస్టేజిగా తమకు చేరే ఎలక్ట్రానిక్ పరికరాలను శుద్ధిచేసిన అనంతరం వేలం ద్వారా తిరిగి అమ్మకానికి ఉంచుతుంది క్లీన్ బే సంస్థ. అలా ఆక్షన్ ద్వారా వచ్చిన మొత్తంలో సగం సొమ్మును ఆ వస్తువు తెచ్చినవారికి ఇచ్చేస్తుంది.

వేలంలో ఉంచగా ఈ అరుదైన కంప్యూటర్ 200 డాలర్లకు (సుమారు 12, 800 రూపాయలు) అమ్ముడుపోయింది. నియమాల ప్రకారం వచ్చిన డబ్బులో సగం ముట్టజెప్పేందుకు ఆ మహిళ కోసం వేట కొనసాగిస్తోంది క్లీన్ బే సంస్థ.

మరిన్ని వార్తలు