చిగురుటాకులా వణుకుతున్న హూస్టన్‌

30 Aug, 2017 13:50 IST|Sakshi
► నగరంలో కర్ఫ్యూ విధించిన అధికారులు
► రికార్డు స్థాయిలో వర్షం


 
 
వాషింగ్టన్‌: హరికేన్‌ హార్వి ధాటికి అమెరికాలోని హూస్టన్‌ నగరం ​చిగురుటాకులా వణుకుతోంది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.  విపరీతంగా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించింది. లూటీలు, దొంగతనాలు, ఇతర నేరాలను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించినట్లు హూస్టన్‌ నగర మేయర్‌ సిల్వెస్టర్‌ టర్నర్‌ పేర్కొన్నారు. వరదలో చిక్కుకున్నవారికి సహాయం చేసేందుకు వెళ్లే బృందాలు, వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు.

గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదైంది. హూస్టన్‌ సిటీలో పలు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. చాలా ఇళ్లు ధ్వంసంకాగా.. 15 మంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ షెల్టర్లలో కాలం గడుపుతున్నారు. 



 
మరిన్ని వార్తలు