టెక్సస్‌ను వణికించి హార్వీ తుఫాను

27 Aug, 2017 09:21 IST|Sakshi
టెక్సస్‌ను వణికించి హార్వీ తుఫాను
హోస్టన్‌: అమెరికాలోనే గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత భారీ తుఫాను టెక్సస్‌ రాష్ట్రాన్ని వణికించింది. హార్వీ తుఫాను సమయంలో గరిష్టంగా గంటకు 195 కి.మీ వేగంతో గాలలు వీచాయి. చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే వారం రోజుల్లో 40 అంగుళాల వర్షం కురవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
మరిన్ని వార్తలు