900కు చేరిన మృతుల సంఖ్య

8 Oct, 2016 13:18 IST|Sakshi
900కు చేరిన మృతుల సంఖ్య

కరీబియన్ దీవుల్లో మాథ్యూ తుఫాను సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక్క హైతీలోనే 900 మందికి పైగా మృతి చెందారని అధికారులు తాజాగా వెల్లడించారు. హైతీ పశ్చిమ ప్రాంతంలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలతో మాథ్యూ హరికేన్ సృష్టించిన బీభత్సానికి వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు 62,000 మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 2010లో సంభవించిన భూకంపం నుంచి ఇప్పుడిప్పడే కోలుకుంటున్న హైతీకి మాథ్యూ తుఫాను పెను నష్టం కలిగించింది.

కొంతమేర బలహీనపడిన ఈ తుఫాను ఇప్పుడు అమెరికాపై ప్రభావం చూపుతోంది. ఫ్లోరిడాలో దీని దాటికి నలుగురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాతో పాటు జార్జియా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 

మరిన్ని వార్తలు