అమెరికాలో మాథ్యూ బీభత్సం

10 Oct, 2016 02:12 IST|Sakshi
ఫాయెట్‌విల్లేలో సహాయక చర్యల్లో నిమగ్నమైన సైనికులు

16 మంది మృతి

విల్మింగ్టన్(అమెరికా): మాథ్యూ తుపాను బలహీనపడ్డా అమెరికాపై ప్రతాపం చూపుతోంది. ఉత్తర కరోలినాలో శని, ఆదివారాల్లో  కుంభవృష్టికి వరదలు ముంచెత్తాయి. ఇళ్లు, కార్లలో చిక్కుకున్న వందల మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇంతవరకూ హరికేన్ ధాటికి అమెరికాలో 16 మంది ప్రాణాలు కోల్పోగా అందులో సగం మంది ఉత్తర కరోలినా వారే. ఉత్తర కరోలినాలో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రు. వర్జీనియా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే వీలుంది.  

 హైతీలో 3 రోజులు సంతాప దినాలు
హైతీలో భారీ ప్రాణ నష్టం నేపథ్యంలో ఆదివారం నుంచి 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. దాదాపు 5 లక్షల మంది పిల్లలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, వారి తక్షణ అవసరాలకు కనీసం 5 బిలియన్ డాలర్లు(రూ.34 వేల కోట్లు) అవసరమవుతాయని యూనిసెఫ్ పేర్కొంది.

మరిన్ని వార్తలు