'ప్లీజ్‌.. నేను ఇంటికి వెళ్లాలి'

24 Jul, 2017 09:06 IST|Sakshi
'ప్లీజ్‌.. నేను ఇంటికి వెళ్లాలి'
బెర్లిన్‌: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరిన ఓ జర్మనీకి చెందిన యువతి తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పింది. తాను తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పుడు తనకు ఉన్న ఏకైక కోరిక అది మాత్రమే అని వెల్లడించింది. 2016లో జర్మనీకి చెందిన నలుగురు యువతులు ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరారు. వారిలో ఓ 16 ఏళ్ల అమ్మాయి ఉంది. ప్రస్తుతం ఇరాక్‌ బలగాల అదుపులోకి వెళ్లి జైలులో ఉన్న ఆ యువతి, తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతూ తీవ్రంగా రోధిస్తోంది.

తాను ఇంటికి వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు తన అభిలాషను చెప్పగా ప్రస్తుతం ఆ యువతికి జర్మనీ విదేశాంగకార్యాలయంలో ఆమెకు సహాయ చర్యలు ప్రారంభించింది. ఈమె కేసును టేకప్‌ చేసిన న్యాయవాది లోరెంజ్‌ హాసే మాట్లాడుతూ ఆ యువతి పేరు లిండా డబ్లు ఇరాక్‌లో గుర్తించిన ఆమెకు ప్రస్తుతం కొంత సహాయం అందుతోందని, అయితే, ఆమె ప్రస్తుత పరిస్థితి ఏమిటో ఇంకా తనకు కూడా స్పష్టంగా తెలియదని అన్నారు. 'ఈ యుద్ధరంగం నుంచి ఈ శబ్ధాల నుంచి నన్ను దూరంగా తీసుకెళ్లండి. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నా ఇంటికి చేర్చండి' అని లిండా చెప్పినట్లు డేర్‌ స్పైజెల్‌ అనే మేగిజిన్‌ తెలిపింది.
మరిన్ని వార్తలు