ఐ లవ్‌యూ.. డు యూ లవ్ మీ..

11 Mar, 2014 06:43 IST|Sakshi

47 ఏళ్ల అమంద.. షెబాను పిచ్చిగా ప్రేమించింది. తన జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలన్నీ షెబాలో ఉన్నాయని నమ్మింది. ఓ రోజు.. మంచి టైమ్ చూసుకుని.. తన మదిలోని మాటను షెబాకు చెప్పాలనుకుంది. ఎర్ర గులాబీ చేతపట్టుకుని.. మోకాళ్లపై కూర్చుని.. ‘ఐ లవ్‌యూ.. డు యు లవ్ మి’ అంది.. షెబాకూ ఈ ప్రేమ ఒకేనే.. అందుకే ఆనందంగా తన సమ్మతి తెలుపుతూ తోక ఆడించింది!! అవును.. తోక ఆడించింది. మరి కుక్క తన మనసులోని భావాలను ఎలా చెబుతుంది. ఇలాగే చెబుతుంది. ఎందుకంటే.. ఇక్కడ అమందా ప్రేమించిన షెబా.. ఆమె పెంపుడు శునకం. అంతేకాదు.. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కూడా.. దక్షిణ లండన్‌కు చెందిన అమందా 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్లాడింది. వారు కొన్ని నెలలకే విడిపోయారు.
 
 తర్వాత ఇన్నేళ్లకు ఆమె మనసుకు నచ్చిన భాగస్వామి షెబా రూపంలో దొరికిందట. తాను బాధలో ఉన్నప్పుడు షెబా ఓదారుస్తుందని.. నవ్విస్తుందని అమందా చెబుతారు. అందుకే 2012 ఆగస్టులో క్రొయేషియాలోని స్ప్లిట్ నగరంలో 200 మంది అతిథుల సమక్షంలో అమందా షెబాను పెళ్లి చేసుకుంది. న్యాయపరంగా తమ వివాహం చెల్లుబాటు కాకున్నా.. తమ వివాహ బంధం రోజురోజుకీ మరింత బలపడుతోందని అమందా చెబుతున్నారు.
 
 ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన కిరీటం. ఎంత పాతదంటే.. 6 వేల ఏళ్ల క్రితం నాటిదన్నమాట. రాబందుల బొమ్మలతో కూడిన ఈ మకుటం ఇజ్రాయెల్ జుదాయెన్ ఎడారిలోని ఓ గుహలో 1961లో దొరికింది. విషయమేమిటంటే దీన్ని తొలిసారిగా ప్రజల సందర్శనకు ఉంచారు. న్యూయార్క్ యూనివర్సిటీలో దీన్ని ప్రదర్శనకు పెట్టారు.

మరిన్ని వార్తలు