అణ్వస్త్ర వ్యతిరేక ప్రచారానికి నోబెల్‌ శాంతి పురస్కారం

6 Oct, 2017 18:38 IST|Sakshi

స్టాక్‌హోమ్ : అణ్వాయుధ వ్యతిరేక ప్రచారానికి 2017 నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది. మానవ మనుగడకు పెను సవాలుగా తయారైన అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టాలని, దేశాలు తమ దగ్గరున్న అణునిల్వలను నిర్మూలించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తోన్న ‘అంతర్జాతీయ అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమం(International Campaign to Abolish Nuclear Weapons-ICAN)కు ఈ ఏడాది నోబెల్‌ శాంతి దక్కినట్లు నోబెల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

2007లో ప్రారంభమైన అణ్వస్త్ర వ్యతిరేక ప్రచార ఉద్యమం (ICAN).. గడిచిన దశాబ్ధ కాలంగా 101 దేశాల్లో అణ్వస్త్రవ్యతిరేక ఉద్యమాలను నిర్వహిస్తోంది. ఐకెన్‌కు అనుబంధంగా ప్రపంవ్యాప్తంగా 468 సంస్థలు పనిచేస్తున్నాయి. వ్యక్తులకు కాకుండా ఒక ఉద్యమ సంస్థకు నోబెల్‌ శాంతి పురస్కారం దక్కడం ఈ దశాబ్ధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం​. 

>
మరిన్ని వార్తలు