భారత్‌ ఫిర్యాదు: పాక్‌కు ఐసీఏవో ప్రశ్నలు

30 Oct, 2019 13:00 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విమానం ప్రయాణించేందుకు వీలుగా గగనతల అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్‌ నిరాకరించడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పౌర విమానాయాన సంస్థ (ఐసీఏవో) దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీఏవో పాక్‌ వివరణ కోరింది. మోదీ యూఏఈ పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్‌ గగనతలం నుంచి ప్రయాణించేందుకు భారత్‌ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అనుమతించలేదు. దీంతో మరో ప్రత్యామ్నాయ మార్గం గుండా ప్రధాని యూఏఈ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయడంతో పాకిస్తాన్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయంటూ దాయాది తమ గగనతలంలో భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించింది.

ఇదే అంశం మీద భారత్‌ అంతర్జాతీయ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్న అంతర్జాతీయ విమానయాన సంస్థ అధ్యక్షుడు ఒలుముయివా బెనార్డ్‌ అలియూ దీనిపై పాకిస్తాన్‌ వివరణ కోరారు. పాక్‌ నుంచి వచ్చే సమాధానం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఐసీఏవో తెలిపింది. అయితే భారత్‌కు చెందిన వీవీఐపీలు ప్రయాణించే ప్రత్యేక విమానాలకు పాకిస్తాన్‌ గగనతలంలో అనుమతులపై ఇంకా స్పష్టత లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానానికి ఇప్పటికే రెండుసార్లు అనుమతి నిరాకరించినప్పటికీ.. భారత్‌ సంయమనం పాటించింది. తాజాగా యూఏఈ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ బయలుదేరుతున్న నేపథ్యంలో భారత్‌ మరోసారి గగనతల అనుమతి కోరింది. తాజాగా కూడా పాక్‌ అనుమతి నిరాకరించడంతో ఫిర్యాదు చేయడమే సరైన చర్యగా భావించి ఫిర్యాదు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  

చదవండి : పాకిస్థాన్‌పై భారత్‌ సీరియస్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మొసలి కళ్లు పీకేసిన బాలిక

నాకు అవార్డులు అక్కర్లేదు... కేవలం..

ఇది నిజంగా ఊహించని పరిణామమే..

భారత్‌పై క్షిపణితో దాడి చేస్తాం: పాక్‌

బాగ్దాదీని తరిమిన కుక్క 

బాగ్దాదీ వారసుడూ హతం

ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందే! 

బాగ్దాదీని ఎలా గుర్తించారంటే..?

ఈనాటి ముఖ్యాంశాలు

వెంటాడే పామును చూశారా?

ఫుట్‌బాల్‌తో మెదడుకు డేంజర్‌

అమెజాన్‌ కొం‍పముంచిన కోడ్‌.. స్టూడెంట్స్‌కు పండగ

‘ఇండియన్‌ అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నా’

అసలు జలుబుకు మందు ఉందా!?

ఎవరిపై.. ఎప్పుడు దాడిచేస్తామో తెలీదు: అ‍మెరికా

ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!

ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీ హతం

బ్రెగ్జిట్‌ గడువు జనవరి 31

పాకిస్థాన్‌పై భారత్‌ సీరియస్‌

ఈ ‘స్లీపింగ్‌ బ్యూటీ’కి ఎంత ముప్పు!

67 ఏళ్లకు మాతృత్వం.. విచారణ తప్పదేమో..!

భారత్‌కు రానున్న ప్రిన్స్‌ చార్లెస్‌

ఈనాటి ముఖ్యాంశాలు

లైంగిక ఆరోపణలపై యుఎస్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు రాజీనామా

వెరైటీ దీపావళి: మీరు రాక్‌స్టార్‌!

పదుల సంఖ్యలో పుర్రెలు...గాజు సీసాలో పిండం!

క్రూరంగా అత్యాచారం చేశాడు.. అందుకే ఆ పేరు..

అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించిన నాసా

ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది